నాలో నేను

- A look into self

Simha Vedantam
1 min readFeb 29, 2024

Click here for English version

“అందమైన శృతిఝరుల సాగరఘోష ను దాటి స రి గ మ ప ద ను ల వీణానాదం వినిపించేనా !!
స్వర్ణమయమైన సంధ్యాకాంతులు దాటి చల్లని వెలుగుల వెన్నెల చంద్రుడు ఉదయించేనా !!
చల్లనైన మంచుతెరల హేమంతం దాటి పుష్పమయమైన వసంతం వెల్లివిరిసేనా !!”

ఆ…!! సాగరఘోష? సంధ్యాకాంతులా?
అసలు ఏం చెప్పాలనుకుంటూన్నావ్ bro??

!!అర్ధమైంది. ఏదో poetic గా రాయాలనిపించి, ఆలా రాసాను.

Hmm… చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి …
అమ్మ చేయి పట్టుకుని school కి వెళ్లిన రోజుల నుంచి 10th board exams వరకు ఎన్నో కాదు కానీ, కొన్ని జ్ఞాపకాలు, కొన్ని enjoy చేస్తాం, కొన్ని regret, కొన్ని అయితే …ప్చ్! మరీ చిన్న పిల్లల్లా behave చేసాం కదా! అనిపిస్తాయి. అవును, అప్పుడు చిన్న పిల్లలమేగా, కానీ ఇప్పుడు గుర్తు తెచ్చుకొని నవ్వుకోటానికి బాగుంటాయి. ఇంక intermediate,
అది కూడా day scholar, కానీ Sri Chaitanya, So, అంతా JEE preparation కే సరిపోయేది.
తర్వాత College, movies లో చూసి college ఇలా ఉంటుంది, ఆలా ఉంటుంది, అని గాలి మేడలు కట్టేసుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చాక ప్రతి రోజు తిట్టుకుంటూనే ఉంటాం, అయితే ఇదే College ని ఇప్పుడు వదిలేయాలంటే మాత్రం, ఇదిగో ఇలా కవితలు రాస్తాం. ఇంతకీ వాటి ఉదేశ్యం ఏంటంటే

మనకి ఏదైనా నచ్చితే అక్కడ మనం ఆగిపోకూడదు కదా, ఆ time కి దాన్ని ఆస్వాదించి ముందుకి వెళ్ళిపోవాలి.
సాగరఘోష బాగుందని ఆగిపోతే ఆ శబ్దాన్ని లయం చేసిన గమకాల వీణా నాదం వినగలమా !!
సాయంత్రం సంధ్య బాగుందని ఆగిపోతే చల్లని వెన్నెల రాత్రిని ఆస్వాదించగలమా !!
హేమంత ఋతువులో మంచు కురిసే వేళ బాగుందని ఆగిపోతే వసంతం చూడగలమా !!

College, అంటే ఎన్నో things, best as memories, worst also as memories but lessons. ఒకప్పటి మనం తో ఇప్పటి మనల్ని పోల్చుకుంటే, ఏదో తెలియని ఒక satisfaction. ఏదో సాధించాం అన్న feeling. ముఖ్యంగా college ముందు మనకి, తర్వాత మనకి. కానీ ఇంతటితో ఆగిపోయే ప్రయాణమా!! ….

— Simha Vedantam

--

--